
సీనియర్ నాయకుడికి ఎమ్మెల్యే KR నాగరాజు ఘననివాళి…
అడప మహేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది…
వర్ధన్నపేట నియోజకవరం 14 డివిజన్ సీనియర్ నాయకులు,సోషల్ మీడియా ఇంచార్జీ అడప మహేష్ ఇటీవల దుర్మరణం చెందిన విషయం విధితమే.బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు 14వ డివిజన్లోని పుష్పరాజ్ ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ,వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ తో హాజరై మహేష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.తన విజయానికి తమ వంతు కృషి చేస్తూ, పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించి, నిబద్ధత కలిగిన నాయకుడు మహేష్ అని స్మరించుకున్నారు.ఆయన సేవలను పార్టీ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు.మహేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు,డివిజన్ అధ్యక్షులు ఇంతియాజ్,వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి,మాజీ కార్పొరేటర్ సులోచన సారయ్య,3వ డివిజన్ అధ్యక్షులు జన్ను కరుణాకర్,డివిజన్,మండల,గ్రామ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
