సూరారం సాయిబాబా నగర్ ఫేస్-1 లోని సర్వేనెంబర్ 49 /6 బాధితులకు కలెక్టర్

Spread the love

సూరారం సాయిబాబా నగర్ ఫేస్-1 లోని సర్వేనెంబర్ 49 /6 బాధితులకు కలెక్టర్ తో మాట్లాడి న్యాయం చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

అదేవిధంగా సూరారం సాయిబాబా నగర్ ఫేజ్ 1 సర్వే నంబర్ 49/6 నివసిస్తున్న 120 కుటుంబాల సభ్యులు స్థానిక కుత్బుల్లాపూర్ రెవెన్యూ సిబ్బంది వారి స్థలాల దగ్గరికి వచ్చి ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇంటి నిర్మాణాలకు చేపట్టారని రెవెన్యూ అధికారులు కూల్చివేతలు ప్రారంభించిన నేపథంలో వారు స్థానిక మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ని కలిసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు ఈ సందర్భంగా వారు కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు…

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ ని షాపూర్ నగర్‌లోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు*.

ఈ సందర్భంగా మంచినీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం తదితర ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను ఆయనకు అందజేసి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

వినతులను స్వీకరించిన కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు…

అనంతరం పలువురు తమ కుటుంబ శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆయనకు అందజేసి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top