
ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉన్న రాంలీలా మైదానంను మరింత అభివృద్ధి చేస్తాం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ …
130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ “శ్రీ రాంలీలా మైదానం” నూతన కమిటీ కార్యవర్గం సభ్యులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి రామ్ లీలా మైదానంలో నిరుపయోగంగా ఉన్న బోరుకు మోటారుకు బిగించడంతో పాటు విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ నూతన కమిటీ అధ్యక్షులైన కొట్టే రవి, ప్రధాన కార్యదర్శి అయిన కొత్తకొండ రవిలను శాలువాతో సత్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ…. సాంస్కృతిక కార్యక్రమాలకు, పండుగలకు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న శ్రీ రామ్ లీలా మైదానములను అభివృద్ధి చేసేందుకు కమిటీ సభ్యులకు నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు ధారం సాయికుమార్, మాణిక్య రెడ్డి, జాయింట్ సెక్రెటరీ మాసిరెడ్డి, శ్రీనివాస్, సెక్రటరీ లక్ష్మణ్, గోవిందప్ప, ఆర్గనైజింగ్ సెక్రటరీలు శ్రావణ్ కుమార్, వీరన్న, భాస్కర్ రెడ్డి, సభ్యులు రంగారావు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
