
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కమిషనర్ అరుణ శ్రీకి కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ విజయ-మల్లేష్….
ఒకటో డివిజన్లో నీటి నిల్వ తొలగింపుతో ప్రజలకు ఊరట – రూ.25 లక్షలతో నిర్మించిన డ్రైనేజీ వల్ల ఇళ్లలోకి నీరు చేరకుండా నివారణ….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఒకటో డివిజన్లోని పీకే రామయ్య కాలనీ, మేడిపల్లి, ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో నీరు నిల్వ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీలకు ఒకటో డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే జేసీబీని పంపించి నీటి నిల్వ తొలగించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జేసీబీతో నీటిని తొలగించి ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.
గతంలో వర్షాలు కురిసిన ప్రతిసారి పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ముందుగానే ఎమ్మెల్యే దృష్టికి ఓపెన్ డ్రైనేజీ సమస్యను తీసుకెళ్లగా, రూ.25 లక్షల వ్యయంతో ఓపెన్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం వల్ల ఈసారి వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించకుండా నివారించగలిగామని తెలిపారు.
డివిజన్ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు స్పందించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కమిషనర్ అరుణ శ్రీలకు ఒకటో డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ పేర్కొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
