
జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నల్లగట్ల శ్రీహరి
భారతీయ జనతా పార్టీజిల్లా ఆఫీస్ నందు బిజెపి జిల్లా అధ్యక్షులు సిఫా రెడ్డి వంశీధర్ రెడ్డి సమక్షంలో ఇనమడుగు సీనియర్ నాయకులు నల్లగట్ల శ్రీహరి ని జిల్లా కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని ప్రతి ఒక్కరం కష్టపడి పని చేద్దాం బిజెపి పార్టీని ముందుకు తీసుకుపోదామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పోలిశెట్టి వెంకట సుబ్బారావు, ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ నాటక రాణి జయచంద్ర, కోవూరు మండల ఉపాధ్యక్షులు కనిశెట్టి మురళి, వీరబోయిన మోహన్, దువ్వూరు సునీలు, చొప్ప కృష్ణ మహేష్ ,ఉన్నం హరిబాబు, షేక్. బాషా, వినకోట బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
