దుండిగల్ గ్రామంలో రూ.70 లక్షల CMC నిధులతో UGD పనులకు శంకుస్థాపన

Spread the love

దుండిగల్ గ్రామంలో రూ.70 లక్షల CMC నిధులతో UGD పనులకు శంకుస్థాపన ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ గ్రామం, 296వ డివిజన్‌లో ఉన్న డ్రైనేజీ, మౌలిక సదుపాయాల సమస్యలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి రాగా, ఆయన ప్రత్యేక చొరవతో CMC నిధుల నుంచి రూ.70 లక్షలు మంజూరయ్యాయి.

ఈ నిధులతో దుండిగల్ గ్రామంలో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడంతో పాటు దుండిగల్ గ్రామం, 296వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కుల మల్లేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు అమరం ముత్యం రెడ్డి, మాజీ సర్పంచ్ కావలి గణేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల ప్రేమ్ కుమార్ పటేల్, కావలి శశి కుమార్, ఆకుల మధు, చిన్న ముత్యం రెడ్డి, బిక్షపతి రెడ్డి, ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top