
రు 4.28 కోట్లతో పడుగుపాడు లో అభివృద్ధి
రు14.50 కోట్లతో బుచ్చిరెడ్డి పాళెం బాంబే హైవే రోడ్ ఆధునీకరణకు నేషనల్ హైవే అథారిటీ ఆమోదం.
ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో ముంబై జాతీయ రహదారి రు.14 కోట్లు తో ఆధునీకరణకు నేషనల్ హైవే అథారిటీ ఆమోదం తెలిపినట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కోవూరు పడుగు పాడు లోని చంద్రమౌళి నగర్ లో 23 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి, పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా సహకారంతో బుచ్చి ముంబై జాతీయ రహదారి ఆధునీకరణకు నేషనల్ అథారిటీ శాఖ మంత్రి ఆమోదం తెలుపుతూ లెటర్ పంపారని తెలిపారు.
ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పథకాలను సమపాలంలో ప్రజలకు అందిస్తుందని అన్నారు. డీఎస్సీ నిర్వహించని గత ప్రభుత్వంకు మెగా డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక్క చంద్రమౌళి నగర్ లోనే రు4. 28 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వారు తెలిపారు రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి ,పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, పడుగుపాడు ఇంచార్జ్ జెట్టి మదన్ రెడ్డి, బత్తుల రమేష్, దారప నేని శ్రీనివాస్ నాయుడు, సూరిశెట్టి శ్రీనివాసులు, వనమ్మ, పాలూరు బాలకృష్ణ, బాల రవి నాటక రాణి వెంకట్, గాదిరాజు అశోక్, జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకులు పోలిశెట్టి సుబ్బారావు, మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
