
సూర్యాపేట జిల్లా డిఎస్ సిడిఓగా కె. లతకు అదనపు బాధ్యతలు
ఉమ్మడి నల్గొండ జిల్లా :
సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి (DSCDO)గా, అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా అదనపు బాధ్యతలను శ్రీమతి కె. లత స్వీకరించారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు జిల్లా కలెక్టర్‌ను శ్రీమతి కె. లత మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు కూడా సూర్యాపేట జిల్లా DSCDOగా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించిన శ్రీమతి కె. లత సమర్థవంతమైన సేవలతో మంచి గుర్తింపు పొందారు. మరోసారి ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడంపై అధికారులు, సిబ్బంది, ప్రజాసంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల సమర్థ అమలుకు ఆమె నిబద్ధతతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఆమెకు అభినందనలు తెలియజేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
