
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కీలక సమావేశంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు , పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
రాబోయే “హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్” పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, సర్ ప్రక్రియ పురోగతిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిగింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంగా భావించి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలన్న విషయాలను శ్రీధర్ బాబు మాట్లాడుతూ వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి , ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ , జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి , వజ్రేష్ యాదవ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
