
అభివృద్ధి నిరంతర ప్రక్రియ…
సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే KR నాగరాజు …
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని వర్ధన్నపేట నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు.శుక్రవారం 1వ డివిజన్లోని బాలాజీనగర్,శ్రీనివాస్ కాలనీ,ఆనందనగర్,పద్మావతినగర్,దుర్గకాలనిలోని 2 కోట్ల 65 లక్షల రోడ్లు,డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య,వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఇది వరకు కాలనీలలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.గతంలో నిర్లక్ష్యానికి గురైన డ్రైనేజీ,రోడ్ల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ కాలనీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం అయితేనే పరిసరాలు పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు.ప్రజా పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగులు వేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తుండన్నారు.
ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము గౌడ్,జిల్లా కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్, PACS చైర్మెన్ మెరుగు రాజేష్ గౌడ్,
సీనియర్ నాయకులు దేవరకొండ అనిల్,గడ్డం శివరాం,పొన్నాల రఘు,గంట రాజిరెడ్డి,మూల తిరుపతిరెడ్డి,రవియాదవ్,ఐలయ్య,రమేష్,మండల సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
