
ప్రగటూల్స్ & బీ.ఎచ్.ఈ.ఎల్ విస్తా కాలనీలో దెబ్బతిన్న రోడ్ల పరిశీలన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ (పేట్ బషీరాబాద్ డివిజన్) పరిధిలోని ప్రగటూల్స్ కాలనీ మరియు బీ.ఎచ్.ఈ.ఎల్ విస్తా కాలనీలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను కాలనీ వాసులతో కలిసి బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి పరిశీలించారు. రోడ్ల దుస్థితి కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాలనీ వాసులను అడిగి తెలుసుకుని, దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో మంజునాథ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాల్ రెడ్డి, వంశీ కృష్ణ, ప్రియాంక రావు, పరిశోదన్ రెడ్డి, బిల్లా, శ్రీనివాస్, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, నల్లనాగుల కృష్ణ, పెద్దింటి సాయిలు, సతీష్ చక్రవర్తి, ప్రవీణ్ గౌడ్, పోల గంగాధర్, శ్రవణ్ బోస్, అంజయ్య, దీపిక, శ్రవణ్, వర్మ, మూర్తి, శివ, రోహిత్ తదితరులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
