
రాజ్యలక్ష్మి కాలనీ అభివృద్ధికి శ్రీకారం….
రూ.50 లక్షలతో రోడ్ల నిర్మాణం.. దశలవారీగా డివిజన్‌లో అన్ని సమస్యల పరిష్కారం….
–మేయర్ మహంకాళి స్వామి…
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం/ : రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఆదేశాల మేరకు 35వ డివిజన్ సప్తగిరి కాలనీ, రాజ్యలక్ష్మి కాలనీలలో దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
35వ డివిజన్ రాజ్యలక్ష్మి కాలనీలో రూ.7 కోట్ల ప్రత్యేక నిధుల ప్యాకేజీలో భాగంగా రూ.8 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్‌తో కలిసి మేయర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఎన్నికైన వెంటనే ఇచ్చిన హామీ మేరకు రాజ్యలక్ష్మి కాలనీ, సప్తగిరి కాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురికాకుండా వరద నీటి కాలువ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కాలనీలు కావడంతో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.
ప్రస్తుతం డ్రైనేజీ నిర్మాణం పూర్తయిందని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రాజ్యలక్ష్మి కాలనీలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇటీవల డివిజన్‌లో వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను గుర్తించామని, ఒక్కొక్క సమస్యను ప్రాధాన్యత క్రమంలో సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మేయర్ స్పష్టం చేశారు.
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
