
దసరా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం…
సామాజిక సేవ నుంచి కళారంగం వరకు ప్రతిభావంతులకు జాతీయ స్థాయి అవార్డులు
సెప్టెంబర్ 25లోపు దరఖాస్తు చేసుకోవాలి….
—డాక్టర్ సురభి శ్రీధర్…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ (వి.ఎస్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో అందించనున్న జాతీయ స్థాయి దసరా పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ తెలిపారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవలో విశేషంగా కృషి చేస్తున్న సామాజిక సేవకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి ఈ పురస్కారాలను అందించనున్నట్లు తెలిపారు.
విద్య, వైద్యం, సంస్కృతి, సామాజిక సేవ, సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద కళలు, కోలాటం, పురోహిత రంగాలతో పాటు ఇతర రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని దసరా పురస్కారాలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
అర్హత, ఆసక్తి ఉన్న వారు సెప్టెంబర్ 25లోపు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ సురభి శ్రీధర్ కోరారు. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం 8977748838, 7013954138 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
సమాజానికి విశేష సేవలందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి, వారి సేవలను గౌరవించడం ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశమని డాక్టర్ సురభి శ్రీధర్ తెలిపారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
