
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే KR నాగరాజు గారు శ్రీకారం…
వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శ్రీకారం చుట్టారు.డివిజన్ లోని వినాయక నగర్,గణేష్ నగర్,రామకృష్ణాపురం, తిమ్మాపూర్,సత్యసాయి కాలనీలలో 3.98కోట్ల నిధులతో సిసిరోడ్లు, డ్రైనేజీతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నియోజకవర్గ అభివృద్ధికి కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అత్యధికంగా నిధులు మంజూరు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు.ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామ,డివిజన్ కాలనీలలో రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ,తాగునీటి సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రజల సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్,మాజీ కార్పొరేటర్ అరుణ విక్టర్,జిల్లా కార్యదర్శి కొమురవెల్లి యాదవ్,కార్యదర్శి ప్రకాష్,మాజీ జెడ్పిటిసి నరేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు బాబురావు,అరుణ, శివకుమార్,రవీందర్,పెద్ద భాస్కర్, సుదాకర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
