
కార్మిక హక్కులను హరిస్తే ఉద్యమాలు ఉధృతం చేస్తాం…..
హక్కులు, చట్టాల పరిరక్షణకు సమరశీల పోరాటాలు తప్పవు….
–ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను, చట్టాలను హరించే చర్యలకు పాల్పడితే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని, ఉద్యమాలను మరింత ఉధృతం చేసి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ హెచ్చరించారు.
పెద్దపల్లి మున్సిపల్, మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి గోదాం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆగస్టు 20న సుల్తానాబాద్‌లో జరగనున్న ఏఐటీయూసీ నాలుగో జిల్లా మహాసభల కరపత్రాన్ని కడారి సునీల్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను, చట్టాలను కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అన్నారు. గతంలో అమల్లో ఉన్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై ఆగస్టు 20న సుల్తానాబాద్‌లో నిర్వహించే ఏఐటీయూసీ నాలుగో జిల్లా మహాసభలో విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు.
జిల్లా మహాసభకు కార్మికులు, శ్రామిక వర్గం అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కడారి సునీల్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సివిల్ సప్లై అధ్యక్షులు ఎం. కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కడారి తిరుపతి, మున్సిపల్ కార్యదర్శి బి. పోషమల్లు, నాయకులు మహేష్, కె. నరేష్, కె. శ్రీనివాస్, బి. శ్రీనివాస్, డి. సతీష్, డి. ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
