
తొర్రురు మండలం లో ఘనంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు..
తొర్రూరు మండలం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారు జన్మదినం రేపు ఉండడంతో ముందస్తుగా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఝాన్సీ రాజేందర్ రెడ్డి కి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొని ఝాన్సీ రాజేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
