సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం ——- ఎమ్మెల్యే జారె, హీరో సుమన్ గౌడ్

Spread the love

సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం ——- ఎమ్మెల్యే జారె, హీరో సుమన్ గౌడ్

అశ్వారావుపేట సాక్షిత :
అణగారిన వర్గాల కోసం నిలబడి ప్రజల గౌరవం కోసం ధైర్యంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు ఆయన చూపిన ధైర్యం పట్టుదల ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని రింగ్ రోడ్డు సెంటర్‌లో మండల గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సినీ హీరో సుమన్ గౌడ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాన్య కుటుంబం నుంచి ఎదిగి ప్రజల కోసం గొంతెత్తిన గొప్ప నాయకుడని అన్నార అప్పటి పరిస్థితుల్లో పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి వాటికి వ్యతిరేకంగా నిలబడిన ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు


ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడిన పాపన్న గౌడ్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు ఆయన పేరు కేవలం ఒక వర్గానికే పరిమితం కాదని ప్రజల కోసం పోరాడిన ప్రతి మహనీయుడి చరిత్రను మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రస్తుత యువత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో మంచి మార్పు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు కష్టాలు వచ్చినప్పుడు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగడం ఇతరులకు అండగా నిలవడం వంటి మంచి లక్షణాలను మహనీయుల జీవితాల నుంచి నేర్చుకోవాలని అన్నారు
అశ్వారావుపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నియోజకవర్గ కేంద్రానికి వచ్చే ప్రజలకు ముఖ్యంగా యువతకు ఈ విగ్రహం పాపన్న గౌడ్ చేసిన పోరాటాలను గుర్తుచేస్తూ ఆయన చరిత్రను తెలుసుకునే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు
విగ్రహ ఏర్పాటుకు చొరవ తీసుకొని అందరి సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మండల గౌడ సంఘం ప్రతినిధులను అభినందించారు భవిష్యత్ తరాలు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను పోరాట స్ఫూర్తిని గుర్తుంచుకునేలా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం జిల్లా,మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

You cannot copy content of this page

Scroll to Top