
కోదాడ కిట్స్ మహిళ ఇంజనీరింగ్ కళాశాల లో విదేశీ విద్యపై అవగాహన సదస్సు :
సూర్యాపేట జిల్లా/ కోదాడ :
ఐ20 ఫీవర్ కన్సల్టింగ్ సంస్థ వారిచే విదేశీ విద్య పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ తెలిపారు.
ఈ అవగాహనా సదస్సు కు
ఐ20 ఫీవర్ కన్సల్టింగ్ సంస్థ డెస్టినేషన్ అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై, బీటెక్ విద్యార్థినులకు విదేశీ విద్యపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా తమ ఐ20 ఫీవర్ కన్సల్టింగ్ సంస్థ గత 20 సంవత్సరాల పైగా , విజయవంతమైన సేవలు అందిస్తూ, విదేశాల్లో చదువు కేవలం విద్యాభ్యాసం మాత్రమే కాకుండా, జీవితాన్ని మార్చే ఒక గొప్ప ప్రయాణం అనే విషయాన్ని వారు విద్యార్థి నులకు వివరించారు.విదేశాలల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సులభంగా, నమ్మకంగా మార్గనిర్దేశం చేయడానికి వారు కట్టుబడి ఉన్నారని, సరైన యూనివర్సిటీలు, కోర్సుల ఎంపిక నుంచి వీసా దరఖాస్తు సహాయం, ప్రీ-డిపార్చర్ సేవల వరకు వారి నిపుణుల బృందం ప్రతి విద్యార్థికి వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని అందిస్తామని విద్యార్థినులు ఈ అవకాశన్నీ వినియోగించు కోవాలని చూచించారు.ఇప్పటి వరకు ఐ20 ఫీవర్ కన్సల్టింగ్ సంస్థ చే 34000 మంది విద్యార్థి నులు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, టీపీవో పుష్ప లత, వివిధ విభాగాదిపతులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
