సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి

Spread the love

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి – కౌండిన్య మహాముని సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి

అణగారిన వర్గాల మధ్య నుండి ఎదిగి, తన పోరాట శక్తితో తెలంగాణ నేలపై స్వీయ పాలనకు పునాది వేసిన అసాధారణ ప్రజా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా కౌండిన్య మహాముని సంఘం ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ మరియు రాజ్ కుమార్ ముదిరాజ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “పాపన్న గౌడ్ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, స్వాభిమాన తెలంగాణకు బాటలు వేశారు. ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌండిన్య మహాముని సంఘం అధ్యక్షులు M.S.గౌడ్ , శివ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రమణ గౌడ్, కంజు శ్రీనివాస్, టెంట్ వెంకటేష్, CH.రాజు, అర్జున్ గౌడ్, పట్నం పవన్, దుర్గారావు, టైలర్ రాజు, తెలుగు తల్లి నగర్ ప్రెసిడెంట్ తారా సింగ్, బద్రి, కరట సీన్, వేణు ముదిరాజ్, జై సింహా రెడ్డి, బైరీష్ గౌడ్ లక్ష్మణ్, రామకృష్ణ, కిట్టు గౌడ్, సత్యనారాయణ గౌడ్, గట్టు అశోక్, నరసింహ గౌడ్, సాయి గౌడ్, నటరాజ్ గౌడ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

You cannot copy content of this page

Scroll to Top