
చిన్నారుల విద్యా ప్రగతిపై మనాలి ఠాకూర్ ఆరా….
విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం….
–మనాలి ఠాకూర్…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ గోదావరిఖని గంగానగర్‌లోని ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మనాలి ఠాకూర్ ఆప్యాయంగా ముచ్చటించి, వారి చదువులు, విద్యా ప్రగతిపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల విద్యాభ్యాసం, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఏవైనా ఇబ్బందులు లేదా అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మనాలి ఠాకూర్ తెలిపారు.
అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణపై కూడా చిన్నారుల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. పచ్చదనం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు పర్యావరణ హిత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆమె పేర్కొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
