రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా

Spread the love

రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా

ఐడిపిఎల్ చౌరస్తా వద్ద దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి మరియు టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ , మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు గారు, బహదూర్‌పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ , సాయిబాబా నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ భాస్కర్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాంద్ భాషా , పాలకృష్ణ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవానికి, కంప్యూటర్ మరియు టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి బలమైన పునాది వేశారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారత నిర్మాణానికి కృషి చేశారు.

యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన రాజీవ్ గాంధీ సేవలు, ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకం.

రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజాసేవలో కొనసాగుదాం.

You cannot copy content of this page

Scroll to Top