
వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
అశ్వారావుపేట :
అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్ వద్ద మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉపాధ్యాయుల సూర్యప్రకాష్ రావు, మండల అధ్యక్షులు కురి శెట్టి నాగబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం మూడు గంటలకు వంగవీటి రాధా చేతులు మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ , గ్రంథాలయం చైర్మన్ పసుపులేటి వీరబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట దేవి ప్రసన్న, మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం పాల్గొంటారని స్పష్టం చేశారు. స్థానిక వ్యవసాయ కళాశాల నుండి కార్, బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నంశెట్టి సత్యనారాయణ, తాడేపల్లి రవి, తోట దుర్గారావు, దండా బత్తుల నరేష్, కట్ట సుబ్బారావు, ఆకుల శ్రీను, చిన్నంశెట్టి నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
