
ఇందిరమ్మ కాలనీకి వెలుగులు.. నాలుగు రోజుల్లో కొత్త వీధి దీపాలు…
మధ్యలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పూర్తి.. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎన్పీడీసీఎల్ అధికారులకు కార్పొరేటర్ విజయ మల్లేష్ కృతజ్ఞతలు….
రామగుండం: రామగుండం కార్పొరేషన్ ఒకటో డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి త్వరలో వీధి దీపాల సమస్య పరిష్కారం కానుంది. విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో వైర్లు వేలాడుతూ, వీధి దీపాలు సరిగా వెలగక రాత్రివేళల్లో కాలనీ చీకటిమయంగా మారుతున్న సమస్యను పరిష్కరించేందుకు శనివారం మధ్యలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.
కాలనీలో నెలకొన్న సమస్యను ఒకటో డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే స్పందించి ఎన్పీడీసీఎల్ అధికారులతో మాట్లాడటంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఎన్పీడీసీఎల్ సిబ్బందితో కలిసి ఎల్‌ఐసీ మల్లేష్, బ్లెడ్ లింగయ్య, దావూద్, అలకుంట లక్ష్మీ, శ్రీనివాస్, ఆటో వెంకటేష్ గల్లీలో విద్యుత్ స్తంభాల మధ్య కొత్తగా మధ్య స్తంభాలను ఏర్పాటు చేసే పనులను పూర్తి చేసినట్లు కార్పొరేటర్ తెలిపారు. మరో నాలుగు రోజుల్లో నూతన వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో పాములు, తేళ్లు వంటి విషసర్పాలు, కీటకాల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారం కావడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని విజయ మల్లేష్ తెలిపారు.
ఇందిరమ్మ కాలనీ ప్రజల సమస్యను పరిష్కరించేందుకు సహకరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎన్పీడీసీఎల్ ఏఈ, ఏడి, సిబ్బందికి కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ లైన్‌మెన్ పూర్ణచందర్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
