
ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటలకు ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’, మరియు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా.
ఇబ్రహీంపట్నం,
.ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ మరియు వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ, బి,రాజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.గ్రామస్తుల రక్షణ, చైతన్యం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు:సైబర్ క్రైమ్స్: ఆన్‌లైన్ మోసాలు, ఓటిపి (OTP) షేరింగ్ మరియు గుర్తుతెలియని లింకుల పట్ల ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు.ఈగల్ ఛాలెంజ్: యువత మరియు గ్రామస్తులు డిజిటల్ భద్రత, సైబర్ నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.పంచాయతీ ఎన్నికలు: త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో, ఎలాంటి గొడవలు లేకుండా నిర్వహించుకోవడానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు.పల్లె నిద్ర: రాత్రి వేళల్లో గ్రామంలోనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకోవడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ఏ డి సి పి, జి,రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
