
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ బలోపేతానికి సమష్టి కృషి చేయాలి….
–ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్…
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, హైదరాబాద్/ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని నాయకులు నిర్ణయించారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంచడంతో పాటు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.
రాబోయే రోజుల్లో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని నాయకులు నిర్ణయించారు.
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, గంప వేణుగోపాల్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
