
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని పలు ఆలయ కమిటీల సభ్యులు, వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు షాపూర్ నగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వివిధ ఆలయ కమిటీ సభ్యులు తమ కుటుంబాల్లో నిర్వహించనున్న వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మాజీ ఎమ్మెల్యేకు అందజేసి, కార్యక్రమాలకు హాజరై ఆశీర్వదించాలని ఆహ్వానించారు.
అనంతరం నియోజకవర్గంలోని వివిధ కాలనీలకు చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తమ ప్రాంతాల్లో నెలకొన్న పలు ప్రజా సమస్యలను కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సావధానంగా విన్న ఆయన, సంబంధిత అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలు ఆలయ కమిటీ సభ్యులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
