
కేటీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన అశ్వారావుపేట మహిళలు
రాఖీ పౌర్ణమి వేళ కేటీఆర్ పై అభిమానం చాటిన ఆడపడుచులు
అశ్వారావుపేట : అశ్వారావుపేటలో రాఖీ పౌర్ణమి వేడుకలు భావోద్వేగంగా జరిగాయి. స్థానిక మహిళలు కేటీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. రాఖీ అనేది అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక అని, తెలంగాణ ఆడపడుచులు కేటీఆర్ ను తమ సోదరుడిగా భావించి ఈ రాఖీని అంకితమిచ్చినట్లు వారు తెలిపారు. తెలంగాణ మహిళలకు అండగా నిలిచే నాయకుడిగా కేటీఆర్ ఎప్పుడూ గుండెల్లో ఉంటారని మహిళలు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి ఇప్పటి వరకు కేటీఆర్ మామ అందించిన సేవలు మరవలేనివని మహిళలు అన్నారు. మహిళా సాధికారతకు ఆయన ఎంత కృషి చేశారని, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. కుటుంబం మహిళలపై చూపించిన ఆప్యాయతను, ప్రేమను కేటీఆర్ కొనసాగిస్తున్నారని, అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు నడిపిస్తున్నారని వారు వివరించారు.
ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. “కేటీఆర్ జిందాబాద్”, “మహిళల అన్న కేటీఆర్” అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్తులో కూడా నాయకత్వం తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు తెస్తుందని మహిళలు విశ్వాసం వ్యక్తం చేశారు. రాఖీ పౌర్ణమి రోజున జరిగిన ఈ వేడుక మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచింది. ఇదే కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయుకులు కాసాని చంద్రమోహన్. బుక్య ప్రసాద్ జుజ్జురపు శ్రీరామ్ మూర్తి, సత్యవరపు సంపూర్ణ, తగరం జగన్నాథం మోటూరి మోహన్, ఆరెపల్లి గోవిందం
మరియు తదితరులకు రాఖీ( పువ్వులు )ను కట్టిన
టిఆర్ఎస్ మహిళలు.. ఈ కార్యక్రమంలో
కాసాని పద్మ, భూక్య ఉదయ జ్యోతి, సాధు జోస్నాబాయి, మరియు మహిళలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
