
విశ్రాంత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి…. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి
వనపర్తి
పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ విశ్రాంత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు, బి ఆర్ యస్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.బీఎస్ ఎన్ ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ) సంస్థలో ముప్పై రెండు సంవత్సరాల పాటు ఉద్యోగ విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న తలారి వెంకటస్వామిని భగీరథ కాలనీలోని ఆయన స్వగృహంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకిత భావంతో ఉద్యోగ విధులు నిర్వహించిన వారు అదే స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలలో, వ్యవసాయ పనులలో నిమగ్నం కావాలని సూచించారు. బీఎస్ ఎన్ ఎల్ లో చక్కని బాధ్యతలు చేపట్టిన వెంకటస్వామి సేవలను చంద్ర శేఖర్ రెడ్డి కొనియాడారు. వినియోగదారులతో ఆయనకు గల అనుబంధాన్ని కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో
సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ బి.ఆర్.ఎస్. నాయకులు నందిమల అశోక్ ,ఆర్.సి.రమేష్ చంద్ర,బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్,డా.కంటే నిరంజనయ్య, డా.బి.శ్యాం సుందర్,కౌసల్య,ప్రవీణ్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
