
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా ప్రారంభ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా ప్రారంభ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు పాల్గొని లక్కీ డ్రాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మన్నె రాజు మాట్లాడుతూ…
“సంవత్సరం తిరిగేలోపు ప్రతి ఆడబిడ్డకు సొంత ఇల్లు ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారు.” అని తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు కేవలం నాలుగు గోడలు కాదు… ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తుకు భరోసా అని అన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో
టీ. స్టాంప్ ప్రకాష్ – ఆర్డీవో, కుత్బుల్లాపూర్
జి. సిద్ధార్థ – ప్రాజెక్ట్ డైరెక్టర్, మేడ్చల్–మల్కాజ్‌గిరి
విమల – సెక్రటరీ, హౌసింగ్ బోర్డ్
వాణి – ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు – ఇదే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం!
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం!
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
