కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు

Spread the love

కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఇందులో భాగంగా, అక్కడ ఉన్న యూటీ (Uti) ఓపెన్ కాస్ట్ గోల్డ్ మైన్‌ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మైన్ వ్యూ పాయింట్ నుండి బంగారం ముడి మట్టి వెలికితీత ప్రక్రియను డిప్యూటీ సీఎం ప్రత్యక్షంగా వీక్షించారు. గనిలో ఎంత లోతు నుంచి బంగారం ముడి సరుకును సేకరిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, బంగారం ఖనిజ గనికి సంబంధించిన సమగ్ర మ్యాప్‌లను ఆయన లోతుగా పరిశీలించారు.

ఈ సందర్భంగా గడిచిన ఐదేళ్ల బంగారు ఉత్పత్తి వివరాలను మైనింగ్ అధికారులు డిప్యూటీ సీఎంకు నివేదించారు. యూటీ ఓపెన్ కాస్ట్‌తో పాటు, ప్రధాన భూగర్భ (అండర్‌గ్రౌండ్) గని ఉత్పత్తుల వివరాలపై కూడా ఆయన ఆరా తీశారు.

ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం వెంట సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top