
ప్రయాణికులతో మమేకమైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
1000 రోజుల ప్రజా పాలన సందర్భంగా గోదావరిఖని బస్టాండ్‌లో మిఠాయిల పంపిణీ….
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలనను పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో గోదావరిఖని బస్టాండ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బస్టాండ్‌లోని బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలు, ప్రయాణ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రయాణికులకు స్వయంగా మిఠాయిలు తినిపించి ప్రజా పాలన 1000 రోజుల వేడుకల్లో వారిని భాగస్వాములను చేశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రయాణికులతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముచ్చటించారు.
మహాలక్ష్మి పథకంపై మహిళల ప్రశంసలు
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉందని పలువురు మహిళా ప్రయాణికులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌తో తెలిపారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్థిక భారం తగ్గడంతో పాటు మహిళలకు ఎంతో భరోసా కలుగుతోందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
