అభివృద్ధి పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి….

Spread the love

అభివృద్ధి పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి….

టెండర్ పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలి…

— మేయర్ మహంకాళి స్వామి…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ మహంకాళి స్వామి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పనులు జరుగుతున్న సమయంలో ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులను ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేస్తే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మేయర్ సూచించారు.

సమావేశంలో నగరపాలక సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్ శాంతి స్వరూప్, సహాయ ఇంజినీర్లు మీర్, మనోజ్, అన్వేష్, సౌమ్య, నరేష్, పర్యవేక్షకుడు పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top