
ప్రగతి నగర్‌లో వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పేదల సంక్షేమ ప్రదాత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ప్రగతి నగర్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు.
276 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తతిరెడ్డి) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 276వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులర్పించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
