
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన
సూర్యాపేట జిల్లా /చిలుకూరు
హామీల అమలుకు పెద్దపీట.. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం-
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.
రైతులు, మహిళలు, యువత, పేదలు, ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే చర్యలు చేపట్టామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వెయ్యి రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తున్నాయని, రానున్న రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతూ.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీత వెంకన్న, ఎడవల్లి పుల్లారావు, హనుమంతరావు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
