
తెలుగుదేశం పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడిగా కట్టా సతీష్….
సూర్యాపేట జిల్లా/ కోదాడ.తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తా……
తెలుగుదేశం పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడిగా కట్టా సతీష్ నియమితులయ్యారు. శుక్రవారం మాజీ ఇన్‌ఛార్జి ఓరుగంటి ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గస్థాయి పార్టీ నాయకుల సమావేశంలో కోదాడ పట్టణ అధ్యక్షుడిగా కట్టా సతీష్, ప్రధాన కార్యదర్శిగా సంపేట బాలకృష్ణలను నాయకులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఓరుగంటి ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పార్టీ ఆవిర్భావం నుంచి కోదాడ ప్రాంతంలో టిడిపికి బలమైన కేడర్ ఉందని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ యువతను భాగస్వామ్యం చేస్తూ పార్టీని మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన అధ్యక్షుడు కట్టా సతీష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కోదాడ పట్టణంలో అన్ని వార్డ్ ల్లో కమిటీలను ఏర్పాటు చేసి టిడిపిని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాతూలూరి గురవయ్య, జనపనేని కృష్ణారావు, కోడే వాసు, పిట్టల శోభన్ బాబు, గోపాలరావు, ముండ్ర రవి, కోదాటి గురవయ్య, గౌని శ్రీనివాస్ గౌడ్, శ్రీ వత్సవ, జంగిలి గోపి, శ్రీమన్నారాయణ, ఏటుకూరి సురేష్, రేవంత్ రెడ్డి, నరేష్ రెడ్డి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
