
నకిరేకల్
మినీ స్టేడియంలో ప్రజా వికాస సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నకిరేకల్ పట్టణానికి విచ్చేస్తున్న నేపథ్యంలో, నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహించనున్న ప్రజా వికాస సభ ఏర్పాట్లను నేడు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు.
ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి, సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రేపు జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన, ప్రజా వికాస సభను విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు.
ఈ పరిశీలనలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
