
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూకట్పల్లి కమలప్రసన్న నగర్ కాలనీ లోని ఇస్కాన్ టెంపుల్ లో ఘనంగా నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ముఖ్యఅతిధిగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులందరితో కలిసి అభిషేకాలు అర్చనలతో హరే రామ హరే కృష్ణ సంకీర్తనలతో స్వామి వారిని ప్రార్ధించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ యశోదా శ్రీకృష్ణుని ఆశీర్వాదం ఎల్లవేళలా మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియచేసారు. కృష్ణాష్టమి పండుగను అత్యంత సుందరంగా మరియు ఘనంగా నిర్వహించిన కూకట్పల్లి ఇస్కాన్ ఆలయ పెద్దలకు అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, నాగేష్ గౌడ్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
