భరత్‌నగర్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం….

Spread the love

భరత్‌నగర్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం….

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు ప్రారంభం….

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం// : నగరపాలక సంస్థ పరిధిలోని 1వ. డివిజన్ భరత్‌నగర్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు.

స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి పైప్‌లైన్ పనులకు నిధులు మంజూరు చేయించారని కార్పొరేటర్ తెలిపారు.

“ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం” అని పేర్కొన్న ఆమె, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

డివిజన్ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు భరత్‌నగర్ ప్రజల తరఫున కార్పొరేటర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో 1వ డివిజన్ సోషల్ మీడియా ఇన్‌చార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, మిషన్ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులు, భరత్‌నగర్ నివాసితులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top