ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ — ₹2,75,000 విలువైన LOC చెక్‌ను మంజూరు

Spread the love

ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ — ₹2,75,000 విలువైన LOC చెక్‌ను మంజూరు చేయించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ .

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ప్రగతినగర్‌కు చెందిన గొల్ల అశోక్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ విషయం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (LOC) ద్వారా ₹2,75,000/- ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ద్వారా మంజూరైన ₹2,75,000/- విలువైన LOC చెక్‌ను భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గొల్ల అశోక్ యాదవ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సహాయం అందేలా ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దర్శన్ యాదవ్ , వికాస్ యాదవ్ , సమ్మయ్య మరియు గొల్ల అశోక్ యాదవ్ గారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top