అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు BRS పార్టీ BLAలు, నాయకులు కృషి చేయాలి: ఆవుల రవీందర్ రెడ్డి

Spread the love

అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు BRS పార్టీ BLAలు, నాయకులు కృషి చేయాలి: ఆవుల రవీందర్ రెడ్డి

బాలానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న SIR ప్రక్రియపై నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆవుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, BLOలతో సమన్వయం చేసుకుంటూ BRS పార్టీ BLAలు, నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. SIR ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ సంబంధిత BLOలను సంప్రదించి, అవసరమైన వివరాలు మరియు పత్రాలను సకాలంలో అందజేసేలా చూడాలని తెలిపారు

అర్హులైన ఓటర్లు నిర్లక్ష్యం చేయకుండా SIR ప్రక్రియలో తమ వివరాలను సరిచూసుకోవాలని, ఎటువంటి కారణంతోనూ అర్హులైన వారు ఓటు హక్కును కోల్పోకుండా BRS పార్టీ BLAలు, నాయకులు ప్రజలకు పూర్తి సహకారం అందించాలని ఆవుల రవీందర్ రెడ్డి కోరారు

You cannot copy content of this page

Scroll to Top