మా బుజ్జి గణపయ్య పోయి రావయ్యా

Spread the love

మా బుజ్జి గణపయ్య పోయి రావయ్యా

టి.యన్. సి. సెంటర్ యూత్ ఆధ్వర్యంలో నిమజ్జనం

1,90,516/లకి లడ్డుని కైవసం చేసుకున్న పచ్చి పులుసు రాజా వెంకట సురేష్, లక్ష్మీ మాధవి దంపతులు.

కోవూరు టి యన్.సి సెంటర్లో యూత్ ఏర్పాటుచేసిన గణపయ్య కు నిమజ్జనం. టి.యన్.సి యూత్ సెంటర్ ఆధ్వర్యంలో ఆ గణనాధుని నిమజ్జనానికి ముఖ్య అతిథులుగా టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, గాదిరాజు అశోక్ విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.కోవూరు మండల ప్రజల సమక్షంలో ఆ గణపయ్య భక్తులకు దర్శనం ఇచ్చి ఆ భక్తులందరూ చూసిన ఆ గణపయ్య కృప కటాక్షం పొందారు. అనంతరం ఘనంగా లడ్డు వేలం పాట లో 1,90,516/కి పచ్చి పులుసు రాజా వెంకట సురేష్ – లక్ష్మీ మాధవి దంపతులు నాగసూరి గణపయ్య ఆశీస్సులతో కైవసం చేసుకున్నారు.అనంతరం భక్తిశ్రద్ధలతో, పరిమళ పుష్పాల అలంకరణతో, ఫెడ్లైట్లో వెలుతురులో, డీజేతో, బాణా సంచరితో, తప్పేట్లతో, ఊరేగింపుగా ఆ గణపయ్యను నిమజ్జనానికి సాగనంపారు.ఈ కార్యక్రమంలో టి.ఎన్. సి. సెంటర్ గణేష్ యూత్,ఆర్యవైశ్యులు, కోవూరు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top