మాజీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడి వివాహ ఎంగేజ్‌మెంట్‌కు

Spread the love

మాజీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడి వివాహ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన వైయస్‌ జగన్‌
నీనా–ఇషాన్‌లను ఆశీర్వదించిన వైయస్‌ జగన్‌ దంపతులు

బెంగళూరులో జరిగిన మాజీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడు ఇషాన్‌ వివాహ ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌, శ్రీమతి వైయస్‌ భారతి దంపతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులు నీనా–ఇషాన్‌లను వైయస్‌ జగన్‌ దంపతులు ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top