స్నేహితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

Spread the love

స్నేహితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న రిటైర్డ్ పోలీస్ అధికారి రవీందర్ కి పరామర్శ…

వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు తన స్నేహితుడు, రిటైర్డ్ పోలీస్ అధికారి జి.రవీందర్ ని పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రవీందర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రవీందర్ త్వరగా పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్నేహితుడిగా ఆత్మీయంగా మాట్లాడి, ఆరోగ్యంపై పలు విషయాలు తెలుసుకున్నారు.ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.

You cannot copy content of this page

Scroll to Top