స్థానిక పోరులో ‘కూటమి’ ప్రభంజనం ఖాయం..

Spread the love

స్థానిక పోరులో ‘కూటమి’ ప్రభంజనం ఖాయం..

బుచ్చిరెడ్డిపాళెం 28 వార్డుల్లో మనమే గెలవాలి

పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరులోని వీపీఆర్‌ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇటీవల కోవూరులో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పర్యటన అత్యంత విజయవంతం కావడంపై కేడర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో పర్యటనలో దొర్లిన చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు దిశా నిర్దేశం చేశారు.”మైటీడీపీ యాప్‌” ద్వారానే నాయకులు, కార్యకర్తల పనితీరు అంచనా
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరును పారదర్శకంగా అంచనా వేసేందుకు అధిష్టానం ‘మైటీడీపీ’ యాప్‌ను ఉపయోగిస్తోందని తెలిపారు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని, కేడర్ భాగస్వామ్యాన్ని తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నందున, నాయకులందరూ ‘మైటీడీపీ’ యాప్ వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, అవసరమైతే తెలిసిన నాయకుల వద్ద శిక్షణ తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో స్థానిక ఎన్నికలు మొదలైనా, అది తమ సొంత బాధ్యతగానే భావించి నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు, సీనియర్ నాయకుల సూచనల మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు*.

You cannot copy content of this page

Scroll to Top