కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

Spread the love

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

సూరారం మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ

గాజులరామారం లో ఘన నివాళులు అర్పించిన పద్మశాలి సంఘం సభ్యులు

కుత్బుల్లాపూర్.:

తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి తరం తెలంగాణ ఉద్యమ నాయకుడు, బడుగు బలహీన వరాల అభ్వుస్పతికి జీవితాంతం కృషి చేసిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని
సూరారం మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి ని పురస్కరించుకొని గాజులరామారం చౌరస్తా లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి సందర్వంగా నివాళులు అర్పించారు.


కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఉమ్మడి గాజులరామారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అధ్యర్యంలోనిర్వహించిన ఈ కార్యక్రమం లో మంత్రి సత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని దేశం కోసం పోరాడటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.పదవుల కంటే ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చిన గొప్ప త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, వెనుకబడిన వర్ణాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన సామాజిక ఉద్యమకారుడని వెర్నొన్నారు. ఈ కార్యక్రమం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షులు ఆడెపు సతీష్, గాజులరామారం డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షులు సాయినాథ్ నేత,సీనియర్ జర్నలిస్ట్ టి రమేష్ తో పాటు పద్మశాలి సంఘం నాయకులు రమేష్, కస్తూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top