ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై కూన శ్రీశైలం గౌడ్ సమీక్ష

Spread the love

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై కూన శ్రీశైలం గౌడ్ సమీక్ష

సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల పట్టణంలో రేపు జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కూన శ్రీశైలం గౌడ్ తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జన సమీకరణ, సభా ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల నిర్వహణపై నాయకులతో చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగే రాజు, సర్ కోఆర్డినేటర్ ప్రవీణ్ టోనీ, ముఖ్య నాయకులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top