రాముడు ధనికుల దేవుడు, శివుడు పేదల దేవుడు అనడం సరికాదు: డాక్టర్ దాసి నాగరాజు

Spread the love

రాముడు ధనికుల దేవుడు, శివుడు పేదల దేవుడు అనడం సరికాదు: డాక్టర్ దాసి నాగరాజు


హైదరాబాద్, : శ్రీరాముడు ధనికుల దేవుడు, పరమశివుడు పేదల దేవుడు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసి నాగరాజు మాట్లాడుతూ, కోట్లాది భారతీయుల ఆరాధ్య దైవాలను ధనికులు, పేదల పేరుతో విభజించడం సమాజంలో అనవసరమైన భేదాలను సృష్టించే ప్రయత్నమని అన్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజల మధ్య ఐక్యత, సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని, ఇలాంటి వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బాచుపల్లి బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్, బిల్డర్ సెల్ కన్వీనర్ పద్మ ప్రసాద్, ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు కొంకి రాము, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top