
70వ S.G.F. జిల్లా స్థాయి గట్కా టోర్నమెంట్–కమ్–సెలెక్షన్స్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ డివిజన్ (గణేష్ నగర్ డివిజన్), వెంకటేశ్వర నగర్లోని బచ్‌పన్ స్కూల్‌లో TVR స్కూల్ కరస్పాండెంట్ శ్రీ T. వంశీకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన 70వ S.G.F. జిల్లా స్థాయి గట్కా టోర్నమెంట్–కమ్–సెలెక్షన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని, క్రీడా మైదానాన్ని ప్రారంభించి, క్రీడాకారులను అభినందించడం ఆనందంగా ఉంది.
గట్కా కేవలం ఒక క్రీడ మాత్రమే కాకుండా ధైర్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంప్రదాయ మార్షల్ ఆర్ట్ అని పేర్కొంటూ, క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి మరింత కష్టపడి ముందుకు సాగాలని సూచించాను.
ఈ సందర్భంగా పాల్గొన్న క్రీడాకారులు, కోచ్‌లు మరియు నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, ఎంపికయ్యే క్రీడాకారులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ బసుపల్లి నాగదీప్ గౌడ్, జ్ఞానేశ్వర్, మనోహర్, తేజ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
