
బతుకమ్మ వేడుకలకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతకు ఆహ్వానం
హైదరాబాద్: గాంధీభవన్‌లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ని స్ఫూర్తి టీం ప్రెసిడెంట్ రమాదేవి, తెలంగాణ స్టేట్ వాసవి సేవక్ చైర్మన్ అల్లాడి మహేష్ గుప్తా, కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించారు.
ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా నిజాంపేట్ సర్కిల్ శ్రీనివాసనగర్ పార్క్‌లో సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కల్వ సుజాత ని కోరారు.
మహిళలందరూ సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాలతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని స్ఫూర్తి టీం సభ్యులు పిలుపునిచ్చారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
