కైసర్ నగర్‌లో 480 ఫ్లాట్లతో 4 ఇందిరమ్మ టవర్స్‌కు ఘనంగా శంకుస్థాపన ||

Spread the love

కైసర్ నగర్‌లో 480 ఫ్లాట్లతో 4 ఇందిరమ్మ టవర్స్‌కు ఘనంగా శంకుస్థాపన ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ఇందిరమ్మ టవర్స్” నిర్మాణానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం సర్కిల్ పరిధిలోని కైసర్ నగర్ లో ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా డీసీసీ తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మంత్రులకు స్వాగతం పలికారు.

కైసర్ నగర్‌లో 480 ఫ్లాట్లతో నిర్మించనున్న 4 ఇందిరమ్మ టవర్స్‌కు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు..

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చేలా కైసర్ నగర్‌లో 480 పేద కుటుంబాలకు గృహాలు అందుబాటులోకి రానుండటం సంతోషకరమన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రులు లబ్ధిదారులకు ఇంటి పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమం అభినందనీయమని అన్నారు. కైసర్ నగర్‌లో నిర్మించనున్న 4 టవర్స్ ద్వారా 480 కుటుంబాలకు సొంతింటి కల నెరవేరడం సంతోషకరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ MD గౌతమ్ , జిల్లా కలెక్టర్ మనోచౌదరి , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు అజయ్ , చరణ్ కౌశిక్ , గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,టీపీసీసీ ప్రోటోకాల్ వైస్ చైర్మన్ బొంగునూరి కిశోరె రెడ్డి, జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నెం రాజు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, మైనారిటీ నాయకులు, SC, ST, NSUI, INTUC నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తై, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలని ఆకాంక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top